

సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న దర్శకులు చాలామంది ఉన్నా, వరుస విజయాలు సాధించినవారికే ఎక్కువ అవకాశాలు వస్తుంటాయి. అలాంటి దర్శకులతోనే స్టార్ హీరోలు పనిచేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఈ క్రమంలోనే మున్నా సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన వంశీ పైడిపల్లి, తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బృందావనం సినిమాతో సూపర్ హిట్ అందుకుని, వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేశారు.
అయితే గత మూడు సంవత్సరాల నుంచి ఏ సినిమా చేయకుండా ఖాళీగా ఉంటున్నాడు. తమిళ్ హీరో విజయ్‌తో చేసిన వారసుడు సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఆయన కొంత వెనకడుగు వేసినట్టుగా తెలుస్తోంది. ఆ సినిమా తర్వాత ఇప్పటివరకు ఆయనకు కొత్త హీరోల నుంచి స్పష్టమైన అవకాశాలు రాలేదనే మాటలు వినిపిస్తున్నాయి.
ఇక బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయాలనే ప్రయత్నాలు చేసినా ఇప్పటివరకు గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఒకప్పుడు అమీర్ ఖాన్‌తో సినిమా అనుకున్నా అది కుదరలేదు. తర్వాత సల్మాన్ ఖాన్ దగ్గరకు కథ తీసుకెళ్లినట్టు చర్చ జరుగుతోంది. అయితే ఆ ప్రాజెక్ట్ జరుగుతుందా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు. వంశీ పైడిపల్లి ప్రతి సినిమాను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తారు. అయినా కూడా సినిమాల మధ్య ఎక్కువ గ్యాప్ రావడం వల్ల ఆయనపై విమర్శలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మళ్లీ బలమైన సినిమాతో సక్సెస్ సాధించడం ఆయనకు చాలా అవసరం.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!