

అరడజనుకు పైగా వరుస ఫ్లాప్స్ తర్వాత హీరో రవితేజ ఈ సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సినిమా కంటెంట్ పరంగా ఓకే అనిపించినా, థియేటర్లకు జనాలు పెద్దగా రాకపోవడంతో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఈ సినిమా ఫలితం సంగతి పక్కనపెడితే, తాజాగా రవితేజ తన కొత్త సినిమాను ప్రకటించాడు. ‘ఇరుముడి’ అనే టైటిల్‌తో ఫస్ట్ లుక్ కూడా విడుదల కావడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అయితే, ఈ సినిమా రీమేక్ అనే రూమర్లు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి.
ఎంత ట్రెండ్స్ మారినా రవితేజ ఎక్కువగా కమర్షియల్ సినిమాలే చేస్తూ వచ్చాడు. మధ్యలో ఈగల్, టైగర్ నాగేశ్వరరావు లాంటి ప్రయోగాత్మక సినిమాలు చేసినా, అందులో కూడా రెగ్యులర్ కమర్షియల్ అంశాలు ఉండటంతో అవి ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించి ‘ఇరుముడి’ సినిమాను ఎంచుకున్నాడు. ఈ చిత్రంలో రవితేజ అయ్యప్ప మాలధారిగా కనిపించబోతున్నాడు. అయితే ఈ చిత్రాన్ని చాలామంది 2022లో వచ్చిన మలయాళ మూవీ 'మాలికాపురం' రీమేక్ అని అంటున్నారు. అందులోనూ ఇలానే హీరో అయ్యప్ప మాల వేసుకుని ఉంటాడు. కూడా ఇద్దరు పిల్లలు ఉంటారు. దీంతో ఈ రెండింటి మధ్య పోలికలు కనిపిస్తున్నాయి.

కొన్నిరోజుల క్రితం శివ నిర్వాణ.. రవితేజతో హారర్ థ్రిల్లర్ సినిమా చేయబోతున్నాడని రూమర్స్ వినిపించాయి. కానీ 'ఇరుముడి' టైటిల్, ఫస్ట్ లుక్ చూస్తే ఇదో కూతురు, దేవుడి సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ మూవీ అనిపిస్తుంది. ఈ క్రమంలోనే 'మాలికాపురం' రీమేక్ అని అంటున్నారు. ఈ మలయాళ సినిమా తెలుగులోనూ డబ్బింగ్ అయి ఓటీటీలోనూ అందుబాటులో ఉంది. అయితే 'ఇరుముడి' రీమేకా కాదా అనేది కొన్నిరోజుల ఆగితే క్లారిటీ వచ్చే అవకాశముంది. 'మాలికాపురం' విషయానికొస్తే.. ఎనిమిదేళ్ల పాప కల్యాణి, అయ్యప్పస్వామి భక్తురాలు. తండ్రితో కలిసి శబరిమల వెళ్లాలనేది ఈమె కల. అనుకోని పరిస్థితుల్లో తండ్రిని కోల్పోతుంది. దీంతో ఓ స్నేహితుడితో కలిసి శబరిమలకు బయలుదేరుతుంది. ఈ ప్రయాణంలో ఎదురయ్యే ప్రమాదాలు, కిడ్నాప్ ప్రయత్నాలు, చివరకు అయ్యప్పన్ అనే వ్యక్తి సాయంతో శబరిమల ఎలా చేరుకున్నారనేది మిగతా స్టోరీ.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!