

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు వరుస విజయాలతో ముందుకు సాగుతున్నారు. పెద్ద సినిమాలు చేయడమే కాకుండా, తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ కూడా ‘పెద్ది’ సినిమాతో తన స్థాయిని మరింత పెంచుకునే ప్రయత్నంలో ఉన్నాడు. గతంలో వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా భారీ డిజాస్టర్ కావడంతో ఆయన కొంత నిరాశకు గురయ్యాడు. ఇప్పుడు ఆ లోటును ‘పెద్ది’తో భర్తీ చేయగలడా అన్నది ఆసక్తికరంగా మారింది.
బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మొదట పెద్ద అంచనాలు లేకపోయినా, విడుదలైన గ్లింప్స్ తర్వాత ప్రేక్షకుల దృష్టి పూర్తిగా మారింది. సినిమా కొత్త స్థాయిలో ఉండబోతుందనే భావన అందరిలో ఏర్పడింది. ఇందులో రామ్ చరణ్ మూడు వేర్వేరు పాత్రల్లో కనిపించబోతున్నాడని సమాచారం. ఒక పాత్రలో క్రికెటర్‌గా, మరో పాత్రలో పహిల్వాన్‌గా (wrestler), ఇంకొక పాత్రలో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా ఆయన నటించనున్నాడట. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రామ్ చరణ్ సినిమా చేయడం అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా మారింది.
ఇప్పటివరకు రామ్ చరణ్ చేసిన సినిమాలు ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. మరి ‘పెద్ది’ సినిమా ఆయన కెరీర్‌ను ఏ స్థాయికి తీసుకెళ్తుందో, ఈ ప్రయోగం ఎంత పెద్ద విజయాన్ని అందిస్తుందో తెలియాలంటే ఇంకొద్దిరోజులు వేచి చూడాల్సిందే.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!