

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘ది రాజాసాబ్’ చిత్రం మరో 11 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాపై ఇప్పటివరకు రావాల్సిన స్థాయి బజ్ కనిపించడం లేదు. సాధారణంగా ప్రభాస్ సినిమాలకు ఉండే క్రేజ్, ఓపెనింగ్స్ ఈసారి కనిపించట్లేదు. ఆయన గత సినిమాలు మొదటి రోజే వంద కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకున్నాయి. కానీ ‘ది రాజాసాబ్’ విషయంలో ఆ అవకాశం మిస్ అయ్యేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత అయినా బజ్ పెరుగుతుందేమో అని అందరూ భావించారు. కానీ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా కదలడం లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ కొత్త ట్రైలర్ రాబోతుందని, అది వేరే లెవెల్ లో ఉంటుందని చెప్పారు. అయితే ఆ ట్రైలర్ కూడా వాయిదా పడింది, ఎప్పుడు విడుదల అవుతుందో తెలియని పరిస్థితి.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ చేసిన ప్రసంగాన్ని గమనిస్తే, సినిమా ఔట్పుట్ పై ఆయన సంతృప్తి గా లేడని తెలుస్తుంది. ప్రసంగం చివర్లో ‘ఈ సంక్రాంతి కి విడుదలయ్యే అన్ని సినిమాలు సూపర్ హిట్ కావాలి. మా సినిమా కూడా సూపర్ హిట్ అయితే సంతోషం’ అని అన్నారు. ఈ మాటలు అభిమానుల్లో సందేహాలు కలిగించాయి. ఎందుకు గట్టిగా హిట్ అని చెప్పలేకపోయారు? సినిమా ఔట్పుట్ పై ప్రభాస్ కు పూర్తి సంతృప్తి లేదా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. అంతేకాదు, డైరెక్టర్ మారుతి ప్రసంగం కూడా అభిమానులకు ఆశ్చర్యం కలిగించింది.
సినిమాపై సరైన హైప్ లేదని మారుతి కి కూడా అర్థమైనట్టే కనిపిస్తోంది. అందుకే స్టేజ్ పై చాలా ఎమోషనల్ గా మాట్లాడి సినిమాపై అంచనాలు పెంచే ప్రయత్నం చేశారు. ప్రభాస్ నటన చూసి కన్నీళ్లు వచ్చాయని, సినిమా నిరాశపరిస్తే తన ఇంటికి వచ్చేయండి అంటూ అడ్రస్ చెప్పడం లాంటి మాటలు కూడా చేశారు. ఇవన్నీ హైప్ కోసం చేస్తున్న ప్రయత్నాల్లా అనిపిస్తున్నాయి. ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ సినిమాకు ఇలాంటి ప్రయత్నాలు అవసరమా అనే ప్రశ్న కూడా వస్తోంది. కంటెంట్ బాగుంటే సినిమా స్వయంగా ముందుకు వెళ్తుంది. కానీ ‘ది రాజాసాబ్’ విషయంలో జరుగుతున్న ఈ పరిణామాలు అభిమానుల్లో ఆందోళన పెంచుతున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!