

లెజెండరీ నటి శ్రీదేవి వారసత్వాన్ని కొనసాగిస్తూ, భారతీయ సినీ ప్రపంచంలో తన ప్రత్యేక గుర్తింపును సృష్టించుకుంటోంది జాన్వి కపూర్. ఇప్పటికే బాలీవుడ్లో పలు చిత్రాల్లో నటించి, తాజాగా “దేవర” సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె మరో భారీ ప్రాజెక్ట్‌లో నటిస్తోంది.
ఈ సినిమా నుండి విడుదలైన “చికిరి” పాట దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతుండగా, ఆమె వ్యక్తిగత జీవితం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.
కొంతకాలంగా జాన్వి కపూర్ వ్యాపారవేత్త శిఖర్ పహారియాతో ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. శిఖర్ పహారియా, మాజీ కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు, అతని సోదరుడు వీర్ పహారియా సినీ నటుడు. అయితే శిఖర్ మాత్రం సినిమాలకంటే బిజినెస్‌పై దృష్టి పెట్టాడు. ఆయన ఒక ప్రొఫెషనల్ పోలో ప్లేయర్ కూడా.
గతంలో జాన్వితో కలిసి అనేకసార్లు కనిపించిన శిఖర్ — ఇప్పుడు ఆ బంధాన్ని మరింత బలపరుచుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల బోనీ కపూర్ 70వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కపూర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రులు అందరూ హాజరయ్యారు. వారిలో శిఖర్ పహారియా కూడా ఒకరు.
అతను అతిథిలా కాకుండా కుటుంబ సభ్యుడిలా వేడుకల్లో పాల్గొనడం గమనార్హం. జాన్వితో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూస్తే జాన్వి–శిఖర్ బంధాన్ని కపూర్ కుటుంబం దాచిపెట్టే ఉద్దేశం లేదని స్పష్టమవుతోంది.
జాన్వి కెరీర్ ఊపందుకుంటున్న ఈ సమయంలో తన రిలేషన్‌షిప్‌ను బహిరంగంగా చూపించడం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది సాధారణ టైంపాస్ డేటింగ్ కాదని, ఇద్దరూ సీరియస్ రిలేషన్లో ఉన్నారని తెలుస్తోంది. త్వరలోనే వారి వివాహ ప్రకటన వచ్చినా ఆశ్చర్యం లేదు.



.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!