

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, విజన్‌రీ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న “వారణాసి” సినిమా ఇప్పటికే భారీ అంచనాలు సృష్టించింది. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా స్థాయిలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇది మహేశ్ బాబు కెరీర్లో మొదటి రాజమౌళి సినిమా కావడం మరో ప్రత్యేకత.
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ సినిమా బడ్జెట్ 1500 కోట్ల వరకు ఉంటుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అధికారిక ధృవీకరణ లేకపోయినా, ఈ రూమర్లు ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహాన్ని పెంచుతున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్,హాలీవుడ్ స్టార్ ప్రియాంకా చోప్రా 'మందాకిని' పాత్రలో, కన్నడ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ పాత్రలో, కోలీవుడ్ నటుడు మాధవన్ ‘హనుమంతుడు’ పాత్రలో నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
అదే సమయంలో మహేశ్ బాబు ఈ సినిమాలో ఒకటి కాదు, రెండు కాదు — మొత్తం ఐదు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అందులో ‘రుద్ర’ అనే పాత్ర ప్రధానమని సమాచారం. రాజమౌళి, మహేశ్ బాబును శ్రీరాముడిలా ప్రెజెంట్ చేయబోతున్నారని కూడా ముందుగా వెల్లడించారు. ప్రస్తుతం వారణాసి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మూవీని 2027 వేసవిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!