

సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ సినిమా ఎంపికలో ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. కథ నచ్చాలి, పాత్ర బలంగా ఉండాలి, మార్పులు తనకు సరిపోవాలి, దర్శకుడిపై పూర్తి నమ్మకం ఉండాలి – ఇవన్నీ ముఖ్యం అయ్యాయి. అందుకే ఇటీవల ఆయన గోపీచంద్ మలినేని, బాబీ, అనిల్ రావిపూడి వంటి యంగ్ డైరెక్టర్లతో ఎక్కువగా పని చేస్తున్నారు.
అయితే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పైసా వసూల్ మాత్రం ప్రత్యేకంగా గుర్తుండిపోయింది. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా, పూరి స్టైల్లో బాలయ్య కనిపించడం అభిమానులకు కొత్త అనుభూతి ఇచ్చింది. ఆ సినిమా తర్వాత ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. పూరితో పని చేసిన హీరోలకు ఇలాంటి బాండింగ్ రావడం సాధారణమే.
ప్రస్తుతం పూరి, విజయ్ సేతుపతి హీరోగా ఒక సినిమా చేస్తున్నారు. అది దాదాపు పూర్తయ్యిందని సమాచారం. ఈ సినిమా తర్వాత బాలయ్య కోసం పూరి ఒక కథ సిద్ధం చేశారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఆ కథ బాలయ్యకు చెప్పారా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఇదే సమయంలో బాలయ్య చేతిలో గోపీచంద్ మలినేని సినిమా, ఆ తర్వాత అనిల్ రావిపూడి సినిమా ఉన్నాయి. మరి పూరి ప్రాజెక్ట్ ఓకే అయితే, అది ఎప్పుడు ప్రారంభమవుతుందో చూడాలి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!