

టాలీవుడ్ హీరో శర్వానంద్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 2023లో రక్షిత రెడ్డిని వివాహం చేసుకున్న శర్వా, గతేడాది పాపకు తండ్రిగా మారారు. చిన్నారికి లీలా దేవి అని పేరు పెట్టారు.
అయితే, సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ జంట మధ్య విభేదాలు తలెత్తినట్లు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం శర్వానంద్, రక్షిత వేరువేరుగా నివసిస్తున్నారని, పాపను ఇద్దరూ పంచుకుని చూసుకుంటున్నారని ప్రచారం.
వీరిద్దరూ ఇంకా విడాకుల నిర్ణయానికి రాలేదని, సమస్యలు సర్దుకుంటే తిరిగి కలిసే అవకాశం ఉందని, లేకపోతే విడిపోవాల్సి వస్తుందని గుసగుస.
ఇంతకుముందు కూడా పలువురు సెలబ్రిటీలపై ఇలాంటి రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఐశ్వర్య రాయ్ – అభిషేక్ బచ్చన్, హన్సిక, పూర్ణ తదితరులపై వచ్చిన విడాకుల వార్తలు తర్వాత పుకార్లుగానే తేలాయి.
ప్రస్తుతం శర్వానంద్ – రక్షిత జంటపై వస్తున్న వార్తలు కూడా నిజమా కాదా అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది. ఈ విషయంపై శర్వా కుటుంబం లేదా హీరో స్వయంగా స్పందించలేదు.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!