

ఈ ఏడాది సంక్రాంతికి మారుతి దర్శకత్వంలో విడుదలైన రాజాసాబ్ సినిమా భారీ డిజాస్టర్‌గా నిలిచింది. విడుదలకు ముందు భారీ హైప్ ఉండటంతో, ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ భారీ అంచనాలతో థియేటర్లకు వెళ్లారు. అయితే సినిమా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రేక్షకులు తీవ్రంగా నిరాశ చెందారు. దీంతో మారుతిపై సోషల్ మీడియాలో ట్రోల్స్, విమర్శలు భారీగా వచ్చాయి. ఈ పరిస్థితుల్లో ఆయన తదుపరి సినిమా ఏంటి అన్న చర్చ మొదలైంది.
‘రాజాసాబ్’ ఫ్లాప్ అయినా మారుతి మరో సినిమాకు సిద్ధమవుతున్నాడని టాక్ వినిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం మెగా హీరోతో సినిమా ఉంటుందని, అది వరుణ్ తేజ్ లేదా రామ్ తో కావచ్చని రూమర్లు వచ్చాయి. అయితే అవన్నీ ఫేక్ అని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు మాత్రం ‘హ్యాపీ పొంగల్’ అనే టైటిల్‌తో ఓ కామెడీ స్క్రిప్ట్ రెడీ చేశారని, దానికి సరైన హీరో కోసం మారుతి వెతుకుతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. టైటిల్‌కు తగ్గట్టే వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారేమో అనే చర్చ సాగుతోంది.
ఇక ‘రాజాసాబ్’ ఫెయిలైనా ప్రభాస్ మాత్రం మారుతికి భరోసా ఇచ్చారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. మీడియం రేంజ్ హీరోలతో కామెడీ సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్న మారుతి, ఈసారి మళ్లీ తనకు అచ్చొచ్చిన జానర్లోనే ఓ మిడ్ రేంజ్ హీరోతో కమ్‌బ్యాక్ ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉందో చూడాల్సి ఉంది.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!