

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కలయికలో రూపొందుతున్న భారీ చిత్రం ‘రాకా’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ చాలా కాలంగా కొనసాగుతోంది. పూర్తిగా ముంబైలోనే షూటింగ్ జరుపుకుంటున్న ఈ దృశ్యవైభవ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందించాలని ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఆసక్తికరమైన సమాచారం వినిపిస్తోంది.
మొదటి భాగానికి సంబంధించిన చిత్రీకరణ దాదాపు ఈ ఏడాది చివరి నాటికి పూర్తయ్యే అవకాశముందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.‘రాకా’ చిత్రంలో దీపికాతో పాటు పలువురు కథానాయికలు నటిస్తుండగా, సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘రాకా’ రెండు భాగాల విడుదలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, మొదటి భాగం షూటింగ్ ఎప్పటికి పూర్తవుతుందనే విషయాలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!