

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు కేవలం టాలీవుడ్ స్టార్ మాత్రమే కాదు… దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన పాన్ ఇండియా హీరో. కోట్లాది మంది అభిమానులతో పాటు, ఉత్తర భారతంలో కూడా తారక్‌కు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ‘RRR’ తర్వాత ఆయన స్టార్డమ్ మరింత విస్తరించింది.
ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్లో అడుగుపెట్టిన చిత్రం ‘వార్ 2’. హృతిక్ రోషన్‌తో కలిసి మేజర్ రఘు విక్రమ్ చలపతి పాత్రలో ఎన్టీఆర్ నటనకు ప్రశంసలు లభించినప్పటికీ, సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.
అయితే ఇప్పుడు తారక్ మరోసారి హిందీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈసారి బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్‌తో కలిసి నటించే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్లో టాక్ నడుస్తోంది.
యష్ రాజ్ ఫిల్మ్స్ రూపొందిస్తున్న స్పై యూనివర్స్‌లో భాగంగా ‘పఠాన్’ సినిమాకు సీక్వెల్ రూపొందించే ఆలోచనలో వైఆర్ఎఫ్ ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ‘పఠాన్ 2’లో షారుఖ్ ఖాన్‌తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో కనిపించనున్నాడని ప్రచారం జరుగుతోంది. ‘వార్ 2’లో పరిచయమైన ఎన్టీఆర్ పాత్ర ఈ సీక్వెల్లో కొనసాగుతుందని కూడా అంటున్నారు.
యష్ రాజ్ ఫిల్మ్స్ తమ స్పై యూనివర్స్‌లో సినిమాల మధ్య కథలను అనుసంధానిస్తూ ముందుకెళ్తోంది. ఇప్పటికే ‘పఠాన్’ సినిమాలో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించగా, ఇప్పుడు అదే తరహాలో ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుందని టాక్.
2023లో విడుదలైన ‘పఠాన్’ చిత్రం షారుఖ్ ఖాన్ కెరీర్లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. దీపికా పదుకొనే, జాన్ అబ్రహం కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే జూనియర్ ఎన్టీఆర్ నిజంగా ‘పఠాన్ 2’లో నటిస్తాడా? లేదా అన్నది ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. ‘వార్ 2’ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని తారక్ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!