

ఇటీవల దేశవ్యాప్తంగా భారీ చర్చకు దారి తీసిన సినిమా ‘ధురందర్’ రణ్వీర్ సింగ్ కెరీర్‌ను కొత్త దశకు తీసుకెళ్లింది. ఈ సినిమాతో అతడికి తొలిసారి వందల కోట్ల వసూళ్లు రావడంతో, అతని స్టార్ ఇమేజ్ గణనీయంగా పెరిగింది. ఈ విజయంతో ఇకపై సినిమాల ఎంపికలో రణ్వీర్ చాలా జాగ్రత్తగా వ్యవహరించనున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో దర్శకుడు శంకర్ తెరకెక్కించబోయే కొత్త సినిమాలో రణ్వీర్ హీరోగా నటించనున్నాడన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
భారీ బడ్జెట్ చిత్రాలకు పేరుగాంచిన దర్శకుడు శంకర్ జెంటిల్మెన్, భారతీయుడు, అపరిచితుడు, శివాజీ, రోబో వంటి ఎన్నో హిట్ సినిమాలు తెరకెక్కించారు. అయితే ఇటీవల ఆయన తీసిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. దీంతో శంకర్ తర్వాతి ప్రాజెక్ట్ ఏదన్నదానిపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో శంకర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా చెప్పుకున్న ‘వేల్పరి’ అనే చారిత్రక నేపథ్య కథను ఇప్పుడు తెరకెక్కించనున్నాడన్న సమాచారం వినిపిస్తోంది.
ఈ చిత్రాన్ని ముంబైకి చెందిన పెన్ స్టూడియోస్ నిర్మించనున్నట్లు రూమర్లు ఉన్నాయి. ఈ సినిమాలో తమిళ నటుడు చియాన్ విక్రమ్‌తో పాటు రణ్వీర్ సింగ్ కూడా నటించే అవకాశం ఉందని టాక్. గతంలో శంకర్, రణ్వీర్తో ‘అపరిచితుడు’ హిందీ రీమేక్ ప్రకటించినా అది ఆగిపోయింది. ‘ధురందర్’ తర్వాత రణ్వీర్ ఇమేజ్ పెరగగా, శంకర్‌కు ఈ సినిమా చాలా కీలకంగా మారింది. మరి వీరిద్దరూ నిజంగా కలిసి పని చేస్తారా లేదా అన్నది చూడాలి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!