
సినిమాలు

దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక మౌలిక వసతుల ప్రాజెక్టులలో ఒకటైన జోజిలా టన్నెల్ నిర్మాణంలో కీలక ఘట్టం విజయవంతంగా పూర్తైంది. జోజిలా టన్నెల్ బ్రేక్‌థ్రూ పూర్తి కావడంతో శ్రీనగర్ మరియు లడక్ మధ్య ఏడాది పొడవునా నిరంతర రాకపోకలకు మార్గం సుగమం కానుంది. ఈ ప్రాజెక్టు ప్రాంతీయ అభివృద్ధి, పర్యాటకం, రవాణా రంగాలకు కొత్త ఊపునివ్వనుంది.
ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పాల్గొన్నారు. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) మేనేజింగ్ డైరెక్టర్ పీ.వి. కృష్ణారెడ్డి, డైరెక్టర్ సి.హెచ్. సుబ్బయ్యతో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!