

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, ఆయన భార్య సంగీత మధ్య కొనసాగుతున్న విడాకుల కేసు విచారణకు ముందు వారి వ్యక్తిగత జీవితంపై ఊహాగానాలు మరింత పెరిగాయి. చెంగల్‌పట్టు ఫ్యామిలీ కోర్టులో కీలక విచారణ జరగనున్న నేపథ్యంలో, కుటుంబ సభ్యులు రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్లు పలు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఈ వార్తలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారి తీస్తుండగా, అభిమానులు ఈ జంట మళ్లీ కలిసిపోవాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
1999లో వివాహం చేసుకున్న విజయ్, సంగీతకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. విడాకుల ప్రక్రియకు సంబంధించిన వార్తలు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల వచ్చిన కథనాల ప్రకారం, పరస్పర అంగీకారంతో సమస్యలను పరిష్కరించుకునే దిశగా చర్చలు సాగుతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై విజయ్ గానీ, సంగీత గానీ అధికారికంగా స్పందించలేదు. కోర్టు విచారణ అనంతరం ఈ వ్యవహారంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!