
జనరల్

కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో దాదాపు రెండు గంటల పాటు జరిగిన చర్చల అనంతరం సీజేపీ (CJP) తమ ఆందోళనను విరమిస్తున్నట్లు ప్రకటించింది. తమ మూడు ప్రధాన డిమాండ్లకు కేంద్రం అంగీకరించిందని, మంగళవారం నాటికి లిఖితపూర్వక హామీ కూడా ఇస్తామని తెలిపిందని సీజేపీ పేర్కొంది.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో తమ తొలి ప్రధాన డిమాండ్ నెరవేరిందని సీజేపీ తెలిపింది. విద్యార్థులు, నిరసనకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఎత్తివేయాలని కోరగా, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని కేంద్రం హామీ ఇచ్చిందని వెల్లడించింది.
దేశవ్యాప్తంగా విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవడంతో పాటు నిబంధనలకు లోబడి ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని కేంద్రం తెలిపిందని సీజేపీ పేర్కొంది. కేంద్రం ఇచ్చిన హామీల నేపథ్యంలో తమ ఆందోళనను విరమిస్తున్నట్లు ప్రకటించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!