23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమెరికా-ఇరాన్‌ చర్చల మధ్య పేలుళ్లు.. హర్మూజ్‌ వద్ద అసలేం జరిగింది?

Writer: Chandrika 11:45 AM, 23 సెప్టెంబర్, 2026
అమెరికా-ఇరాన్‌ చర్చల మధ్య పేలుళ్లు.. హర్మూజ్‌ వద్ద అసలేం జరిగింది?

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఐరాస 81వ సర్వ ప్రతినిధి సభ సమావేశాల నేపథ్యంలో న్యూయార్క్‌లో అమెరికా, ఇరాన్ ప్రతినిధులు చర్చలు జరిపారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ మధ్య జరిగిన చర్చల్లో హర్మూజ్‌ జలసంధి అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ఈ కీలక జలమార్గాన్ని తిరిగి తెరవాలంటే అమెరికా నౌకా దిగ్బంధనాన్ని తక్షణమే ఎత్తివేయడం, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం, తమ మిత్ర కూటములపై జరుగుతున్న దాడులను నిలిపివేయడం వంటి షరతులను ఇరాన్‌ అమెరికా ముందు ఉంచినట్లు ఇరాన్‌ మీడియా వెల్లడించింది. సుమారు మూడు గంటల పాటు జరిగిన ఈ చర్చలు సానుకూలంగా సాగాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. త్వరలో మరో దఫా చర్చలు జరగనున్నట్లు తెలిపారు.

మరోవైపు అమెరికా, ఇరాన్ ప్రతినిధులు న్యూయార్క్‌లో చర్చలు జరుపుతున్న సమయంలోనే హర్మూజ్‌ జలసంధికి సమీపంలోని ఇరాన్‌ ఖేష్మ్‌ ద్వీపం వద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు అక్కడి అధికారిక మీడియా తెలిపింది. పేలుళ్లు సముద్రం వైపు నుంచి వినిపించినట్లు ఇరాన్‌ అధికారిక వార్తా సంస్థ ఐఆర్‌ఎన్‌ఏ పేర్కొంది. అయితే వాటికి కారణం, జరిగిన నష్టం గురించి వెంటనే స్పష్టత రాలేదు. ఇదే సమయంలో ఐరాస ప్రసంగంలో ట్రంప్‌ ఇరాన్‌పై తీవ్ర హెచ్చరికలు చేసినప్పటికీ, ఒప్పందానికి అవకాశం ఉందన్న సంకేతాలు కూడా ఇచ్చారు. అమెరికా సైనిక ఒత్తిడిని తగ్గించి, నౌకా దిగ్బంధనాన్ని ఎత్తివేస్తే సుమారు వారంలో హర్మూజ్‌ను తిరిగి తెరవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్‌ ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అంతర్‌రాష్ట్ర జలాల సమస్యల పరిష్కారం కోసం కర్ణాటక సీఎంతో తెలంగాణ మంత్రుల భేటీ

అంతర్‌రాష్ట్ర జలాల సమస్యల పరిష్కారం కోసం కర్ణాటక సీఎంతో తెలంగాణ మంత్రుల భేటీ

బాగ్దాద్‌కు ఇరాన్‌ విమానాలు నిలిపివేసిన ఇరాక్‌...

బాగ్దాద్‌కు ఇరాన్‌ విమానాలు నిలిపివేసిన ఇరాక్‌...

ఏపీలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

ఏపీలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

నంద్యాల జిల్లా గోరుకల్లు రిజర్వాయర్‌లో కలకలం..

నంద్యాల జిల్లా గోరుకల్లు రిజర్వాయర్‌లో కలకలం..

ఆయుర్వేదంతో ఆరోగ్యకరమైన జీవనం.. మంత్రి దామోదర్ రాజనర్సింహ

ఆయుర్వేదంతో ఆరోగ్యకరమైన జీవనం.. మంత్రి దామోదర్ రాజనర్సింహ

ఏపీ విద్యార్థులకు ఆధార్‌ అప్డేట్‌కు మరో అవకాశం

ఏపీ విద్యార్థులకు ఆధార్‌ అప్డేట్‌కు మరో అవకాశం

ట్యాగ్లు
యూఎస్‌ ఇరాన్ చర్చలుఇరాన్అమెరికాహర్మూజ్‌ జలసంధిఅబ్బాస్ అరాగ్చీస్టీవ్ విట్కాఫ్డొనాల్డ్ ట్రంప్ఐరాస సర్వ ప్రతినిధి సభపశ్చిమాసియా ఉద్రిక్తతలుఖేష్మ్ ద్వీపం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెళ్లిపై మనసులో మాట చెప్పిన శ్రుతి హాసన్
సినిమాలు

పెళ్లిపై మనసులో మాట చెప్పిన శ్రుతి హాసన్

అంతర్‌రాష్ట్ర జలాల సమస్యల పరిష్కారం కోసం కర్ణాటక సీఎంతో తెలంగాణ మంత్రుల భేటీ
జనరల్

అంతర్‌రాష్ట్ర జలాల సమస్యల పరిష్కారం కోసం కర్ణాటక సీఎంతో తెలంగాణ మంత్రుల భేటీ

బాగ్దాద్‌కు ఇరాన్‌ విమానాలు నిలిపివేసిన ఇరాక్‌...
జనరల్

బాగ్దాద్‌కు ఇరాన్‌ విమానాలు నిలిపివేసిన ఇరాక్‌...

భారత్‌పై గ్లోబల్ ఇన్వెస్టర్లకు నమ్మకం.. పన్నుల విధానమే ఆందోళన: జేపీ మోర్గాన్ సీఈవో
బిజినెస్

భారత్‌పై గ్లోబల్ ఇన్వెస్టర్లకు నమ్మకం.. పన్నుల విధానమే ఆందోళన: జేపీ మోర్గాన్ సీఈవో

బలమైన పాత్రల కోసం నిధి అగర్వాల్‌ ప్రయత్నం
సినిమాలు

బలమైన పాత్రల కోసం నిధి అగర్వాల్‌ ప్రయత్నం

ఏపీలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
జనరల్

ఏపీలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

నంద్యాల జిల్లా గోరుకల్లు రిజర్వాయర్‌లో కలకలం..
జనరల్

నంద్యాల జిల్లా గోరుకల్లు రిజర్వాయర్‌లో కలకలం..

ఆయుర్వేదంతో ఆరోగ్యకరమైన జీవనం.. మంత్రి దామోదర్ రాజనర్సింహ
జనరల్

ఆయుర్వేదంతో ఆరోగ్యకరమైన జీవనం.. మంత్రి దామోదర్ రాజనర్సింహ

ఆసియా క్రీడల్లో మీరాబాయి చానుకు రజతం..
క్రీడలు

ఆసియా క్రీడల్లో మీరాబాయి చానుకు రజతం..

ఏపీ విద్యార్థులకు ఆధార్‌ అప్డేట్‌కు మరో అవకాశం
జనరల్

ఏపీ విద్యార్థులకు ఆధార్‌ అప్డేట్‌కు మరో అవకాశం

ఇరాన్‌ గగనతలంలో వింత వస్తువు.. ‘బ్లాక్ మాంతా’ విమానమేనా?
జనరల్

ఇరాన్‌ గగనతలంలో వింత వస్తువు.. ‘బ్లాక్ మాంతా’ విమానమేనా?

ఏపీ డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌ అప్‌డేట్...
జనరల్

ఏపీ డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌ అప్‌డేట్...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!