
జనరల్

విదేశీ వృత్తి నిపుణుల హెచ్1బీ వీసాలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన లక్ష డాలర్ల ఫీజును అమెరికా న్యాయస్థానం రద్దు చేసింది. బోస్టన్ ఫెడరల్ కోర్టు ఈ నిర్ణయం చట్ట విరుద్ధమని ప్రకటించింది. అమెరికా కాంగ్రెస్ ఆమోదం లేకుండా విధించిన ఈ ఫీజు ఒక పన్నుగా పరిగణించబడుతుందని, అది చెల్లదని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి లియో సొరొకిన్ తీర్పు ఇచ్చారు.
గత సెప్టెంబరులో ట్రంప్ ప్రభుత్వం హెచ్1బీ వీసా ఎంపికైన విదేశీయులు లక్ష డాలర్లు చెల్లించాలనే నిర్ణయం తీసుకుంది. దీనిని వ్యతిరేకిస్తూ 20 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ బోస్టన్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ అనంతరం కోర్టు ఆ ఫీజు చట్ట విరుద్ధమని తేల్చింది. ఇది పెనాల్టీ కాకుండా పన్ను అని, కాంగ్రెస్ అనుమతి లేకుండా అధ్యక్షుడు అలాంటి నిర్ణయం తీసుకోలేరని కోర్టు స్పష్టం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!