
జనరల్

అస్సాంలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కామ్రూప్ మెట్రో జిల్లాలోని దిగారు రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం ఉదయం కోల్కతా–సైరాంగ్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో రైలు ఇంజిన్తో పాటు ఆరు బోగీలు పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. లోకో పైలట్ రైలు వేగాన్ని నియంత్రించలేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.
ఈ ఘటనలో ప్రయాణికులెవరికీ గాయాలు కాలేదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రత్యామ్నాయ రైలును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పట్టాలు తప్పిన బోగీలను తొలగించి రైలు మార్గాన్ని పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!