
జనరల్

పాకిస్థాన్ మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా పేరుగాంచిన షోయబ్ అక్తర్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన పెద్దన్నయ్య షాహిద్ అక్తర్ మంగళవారం అర్ధరాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని షోయబ్ అక్తర్ తన సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన ప్రియమైన సోదరుడు అల్లా చెంతకు చేరాడని పేర్కొంటూ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.
షాహిద్ అక్తర్ మరణానికి గల కారణాలు ఇంకా వెల్లడికాలేదు. హెచ్ 8 స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఇప్పటికే 2021లో తన తల్లిని కోల్పోయిన షోయబ్ అక్తర్, ఇప్పుడు తన అన్నయ్యను కూడా కోల్పోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు అక్తర్ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!