

తెలంగాణలో రెస్టారెంట్లపై TG SAFE అధికారులు సెప్టెంబర్ 24న ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు. మొత్తం ఎనిమిది ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు 15 రెస్టారెంట్లలో తనిఖీలు చేపట్టాయి. ఈ తనిఖీల్లో ఆహార భద్రత, పరిశుభ్రతకు సంబంధించిన పలు ఉల్లంఘనలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పలు రెస్టారెంట్లపై చర్యలు తీసుకున్నారు.
నిత్యం రద్దీగా ఉండే లక్కీ రెస్టారెంట్‌లో బొద్దింకలు, ఎలుకలు, ఈగలు, ఎలుకల మల విసర్జన ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎక్స్‌పైర్డ్ ఫుడ్, పాడైన కూరగాయలను గుర్తించి అక్కడికక్కడే డిస్పోజ్ చేశారు. కల్తీ అనుమానంతో 16 ఫుడ్ శాంపిల్స్ సేకరించారు. వాటర్ రిపోర్ట్స్, హెల్త్ రికార్డులు, పెస్ట్ కంట్రోల్ రికార్డులు లేకపోవడంతో పాటు ఫుడ్ హ్యాండ్లర్ల పరిశుభ్రతలో లోపాలు గుర్తించారు. FSSAI లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న లక్కీ రెస్టారెంట్‌ను మూసివేయాలని ఆదేశించారు. ఐదు సంస్థలకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేసి రీ-ఇన్‌స్పెక్షన్ నిర్వహించనున్నారు. ఎనిమిది రెస్టారెంట్ల FSSAI లైసెన్సులను సస్పెండ్ చేసి కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశించారు. పాక్వాన్ గ్రాండ్‌లో 1,170 కిలోల ఎక్స్‌పైర్డ్ రైస్ బ్యాగులు, 45 కిలోల లేబులింగ్ లోపాలున్న నూడుల్స్ గుర్తించినట్లు అధికారులు తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!