
సినిమాలు

తెలంగాణలోని మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన కుంచా అన్షుల్ అమెరికాలోని న్యూయార్క్‌లో దారుణ హత్యకు గురయ్యాడు. జీవనోపాధి కోసం అమెరికాకు వెళ్లిన అన్షుల్ అక్కడ పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. అర్ధరాత్రి సమయంలో విధుల్లో భాగంగా పిజ్జా డెలివరీకి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
అర్ధరాత్రి 12 గంటల సమయంలో డెలివరీ చేస్తున్న అన్షుల్‌పై గుర్తుతెలియని దుండగులు తుపాకీతో కాల్పులు జరిపినట్లు సమాచారం. తీవ్ర గాయాలపాలైన అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!