
జనరల్

బీహార్ పంచాయతీ రాజ్ మంత్రి దీపక్ ప్రకాశ్ మళ్లీ మంత్రిగా నియమించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆయన శాసనసభ లేదా శాసనమండలి సభ్యుడు కాదని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(4) ప్రకారం ఇచ్చే ఆరు నెలల గడువు సౌకర్యం ఒక్కసారే వర్తిస్తుందని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను సామాజిక కార్యకర్త రాకేష్ కుమార్ సింగ్ దాఖలు చేశారు.
పిటిషన్ ప్రకారం దీపక్ ప్రకాశ్‌ను మొదటగా 20 నవంబర్ 2025న మంత్రిగా నియమించారు. అనంతరం ముఖ్యమంత్రి మార్పు తర్వాత 7 మే 2026న ఆయనను మళ్లీ మంత్రిగా నియమించినట్లు పేర్కొన్నారు. మొదటి నియామకం తేదీ నుంచే ఆరు నెలల గడువు లెక్కిస్తే 20 మే 2026తో అది ముగుస్తుందని, ఆ తర్వాత కూడా పదవిలో కొనసాగేందుకు అవకాశం కల్పించడమే రాజ్యాంగ ఉల్లంఘనగా పిటిషనర్ వాదిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!