
జనరల్

సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల అధికారిక ప్రతులు అందే వరకు 19 మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏడు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పునేఠా కీలక ఆదేశాలు జారీ చేశారు.
సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అయితే, సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రతులు ఇంకా రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందలేదని పునేఠా వెల్లడించారు. అధికారిక ఉత్తర్వులు అందిన తర్వాత వాటి ప్రకారం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!