

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త, ఆర్థికవేత్త పరకాల ప్రభాకర్ అక్టోబర్ 23న ఎస్‌ఐఆర్ (ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ)కు వ్యతిరేకంగా నిర్వహించనున్న దేశవ్యాప్త నిరసనల్లో పాల్గొననున్నారు. ‘పీపుల్ అగైనెస్ట్ ఎస్‌ఐఆర్’ కూటమి ఆధ్వర్యంలో జరిగే ఈ ఆందోళనల్లో ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలని, తొలగించిన ఓటర్ల పేర్లను తిరిగి చేర్చాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించి, ఆయనపై చర్యలు తీసుకోవాలని నిర్వాహకులు డిమాండ్ చేయనున్నారు.
ఈ నిరసనల్లో నటుడు ప్రకాశ్ రాజ్, సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, రైతు నాయకుడు రాకేశ్ టికాయత్, కాక్‌రొచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఇండియా కూటమి పార్టీలను సైతం ఆందోళనల్లో భాగస్వాములు కావాలని నిర్వాహకులు కోరారు. అయితే, ఆ పార్టీల భాగస్వామ్యంపై ఇంకా స్పష్టత రాలేదు. “ప్రతి చేతిలో త్రివర్ణ పతాకం.. ప్రతి వీధిలో జంతర్ మంతర్” అనే నినాదంతో దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. ఎస్‌ఐఆర్ వల్ల అర్హులైన ఓటర్లు ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. అయితే, ఓటర్ల జాబితాలను నవీకరించడమే ఈసీ చేపట్టిన సవరణ ప్రక్రియ లక్ష్యం కాగా, రాజకీయ ప్రేరణతో పేర్లు తొలగిస్తున్నారన్న ఆరోపణలు వివాదాస్పదంగా ఉన్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!