

దేశంలో పెరుగుతున్న డిజిటల్ అరెస్టు మోసాలు, సైబర్ నేరాలను అరికట్టేందుకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ తరహా మోసాలను నియంత్రించేందుకు తీసుకోబోయే చర్యలపై సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలని వాట్సాప్‌తో పాటు ఇతర డిజిటల్ మధ్యవర్తి సంస్థలను ఆదేశించింది. తమ ప్రతిపాదనలను ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C)తో కూడా పంచుకోవాలని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్టు మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేసింది.
అలాగే అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలను గుర్తించి, బాధితులు డబ్బు కోల్పోకుండా నిరోధించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మరింత పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలని ధర్మాసనం సూచించింది. ఈ తరహా సైబర్ నేరాలకు సంబంధించి నమోదైన కేసులు, దర్యాప్తు వివరాలు, భవిష్యత్తులో తీసుకోనున్న చర్యలపై నివేదికలు సమర్పించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ కేసుపై తదుపరి విచారణను నవంబర్ 23, 2026కు వాయిదా వేసింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!