
జనరల్

సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచుతూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆర్డినెన్స్ జారీ చేశారు. ప్రధాన న్యాయమూర్తితో కలిపి ప్రస్తుతం ఉన్న 34 మంది న్యాయమూర్తుల సంఖ్యను 38కు పెంచాలని నిర్ణయించారు.
దేశంలో పెరుగుతున్న కేసుల భారం, పెండింగ్ వ్యవహారాల పరిష్కారాన్ని వేగవంతం చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. న్యాయ వ్యవస్థ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో ఈ నిర్ణయం కీలకంగా మారనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!