
సినిమాలు

నైరుతి రుతుపవనాలు క్రమేపి ఉత్తర దిశగా విస్తరిస్తున్నాయని, మరింత ముందుకు సాగేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాధ కుమార్ తెలిపారు. రాబోయే రెండు నుంచి మూడు రోజుల్లో రాయలసీమతో పాటు దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందన్నారు.
జూన్ 15 నాటికి రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాలు వ్యాపించే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రతి ఏడాది ఒకే తేదీన రుతుపవనాలు విస్తరించాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. వచ్చే వారం రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే సాధారణం కంటే కొద్దిగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, కొన్ని ప్రాంతాల్లో వచ్చే ఐదు రోజుల పాటు వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!