

న్యూఢిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకున్న నాయకులు, నిరసనకారులను 24 గంటల్లో విడుదల చేయాలని పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్‌చుక్ డిమాండ్ చేశారు. వారిని విడుదల చేయకపోతే నిరాహారదీక్ష లేదా పాదయాత్ర చేపడతానని హెచ్చరించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనలకు పిలుపునిచ్చింది. అయితే, ఆందోళనకు అనుమతి లేదని పేర్కొన్న పోలీసులు నిరసనలో పాల్గొన్న నాయకులు, విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిరసనకారుల అరెస్టులను వాంగ్‌చుక్ ఖండిస్తూ, ప్రస్తుత పరిస్థితులు ప్రకటించని ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని విమర్శించారు.
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్‌లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిరసనకు పలువురు రాజకీయ నాయకులు మద్దతు ఇవ్వడం సంతోషంగా ఉందని వాంగ్‌చుక్ తెలిపారు. అయితే, వారందరినీ అదుపులోకి తీసుకున్నట్లు తెలిసిందని, ప్రభుత్వం మరుసటి రోజులోగా వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరాహారదీక్ష లేదా పాదయాత్ర చేపడతానని స్పష్టం చేశారు. గతంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ కూడా వాంగ్‌చుక్ నిరాహారదీక్ష చేపట్టారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!