
సినిమాలు

కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు తన రాజీనామా లేఖను సమర్పించనున్నట్లు సమాచారం. అనంతరం సాయంత్రం 5 గంటలకు ఢిల్లీకి వెళ్లనున్న ఆయన, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
ఇక రేపు బెంగళూరులో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో డి.కె. శివకుమార్‌ను శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యేలు ఎన్నుకునే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలు కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!