23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హూతీల విషయంలో అమెరికా వైఖరిపై సౌదీ అసంతృప్తి..

Writer: Chandrika 10:56 AM, 23 సెప్టెంబర్, 2026
హూతీల విషయంలో అమెరికా వైఖరిపై సౌదీ అసంతృప్తి..

యెమెన్‌లోని హూతీలపై అమెరికా పరిమిత సైనిక జోక్యంతో సౌదీ అరేబియా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రియాద్‌, వాషింగ్టన్ మధ్య సంబంధాల్లో మరింత ఉద్రిక్తత ఏర్పడే అవకాశం ఉందని మాజీ అమెరికా ఇంటెలిజెన్స్ అధికారి రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కరెన్ గిబ్సన్ పేర్కొన్నారు. హూతీలపై కొత్త వైమానిక దాడులకు అమెరికా వెనుకాడిన విషయాన్ని సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ (MBS) సులభంగా మర్చిపోరని ఆమె వ్యాఖ్యానించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే అమెరికా సౌదీకి ఇంటెలిజెన్స్, ఆయుధాలు, ఎయిర్ డిఫెన్స్ సహాయాన్ని కొనసాగిస్తోంది. మరోవైపు ఒమన్ మధ్యవర్తిత్వంతో హూతీలతో చర్చలు కూడా కొనసాగిస్తోంది. ఇదే సమయంలో సౌదీ అభ్యర్థన మేరకు బ్రిటన్ పరిమిత కాలం రక్షణాత్మక ఎయిర్‌-టు-ఎయిర్ రీఫ్యూయలింగ్ సాయం అందించేందుకు అంగీకరించింది.

యెమెన్‌లో ఘర్షణలు మళ్లీ తీవ్రం కావడంతో ఎర్ర సముద్రం, బాబ్ అల్-మాండెబ్ జలసంధి భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. యెమెన్‌లోని ఎర్ర సముద్ర తీర ప్రాంతాల్లో హూతీలు తమ ఆధిపత్యాన్ని విస్తరిస్తున్నట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సౌదీ భద్రతకు మద్దతుగా బ్రిటన్‌ రీఫ్యూయలింగ్‌ విమానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. మరోవైపు సౌదీకి దాదాపు 50 ఎఫ్-35 యుద్ధ విమానాల విక్రయానికి అమెరికా నోటిఫై చేసినట్లు సమాచారం. అయితే వాటి సరఫరాకు కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. సౌదీ అంశంతో పాటు ప్రాంతీయ భద్రతపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్‌లో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ప్రతినిధులతో చర్చించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐమెక్‌కు అమెరికా పూర్తి మద్దతు.. ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

ఐమెక్‌కు అమెరికా పూర్తి మద్దతు.. ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

సుంకాల వేళ మోదీ-ట్రంప్ భేటీకి అవకాశం

సుంకాల వేళ మోదీ-ట్రంప్ భేటీకి అవకాశం

తెలంగాణ ఈగల్ ఫోర్స్ టీమ్‌కు సీఎం అభినందనలు

తెలంగాణ ఈగల్ ఫోర్స్ టీమ్‌కు సీఎం అభినందనలు

అమెరికా-ఇరాన్‌ చర్చల మధ్య పేలుళ్లు.. హర్మూజ్‌ వద్ద అసలేం జరిగింది?

అమెరికా-ఇరాన్‌ చర్చల మధ్య పేలుళ్లు.. హర్మూజ్‌ వద్ద అసలేం జరిగింది?

‘ప్యారడైజ్‌’ టికెట్‌ రేట్ల పెంపుపై పునఃసమీక్షించండి.. ప్రభుత్వానికి హైకోర్టు సూచన

‘ప్యారడైజ్‌’ టికెట్‌ రేట్ల పెంపుపై పునఃసమీక్షించండి.. ప్రభుత్వానికి హైకోర్టు సూచన

నిమజ్జనంలో శబ్ద నియంత్రణపై రిపోర్ట్ ఇవ్వండి.. హోంశాఖకు హైకోర్టు ఆదేశం

నిమజ్జనంలో శబ్ద నియంత్రణపై రిపోర్ట్ ఇవ్వండి.. హోంశాఖకు హైకోర్టు ఆదేశం

ట్యాగ్లు
సౌదీ అరేబియాఅమెరికామొహమ్మద్ బిన్ సల్మాన్ఎంబీఎస్హూతీలుయెమెన్ సంక్షోభంఎర్ర సముద్రంబాబ్ అల్ మాండెబ్బ్రిటన్ రక్షణ సాయంఎఫ్-35 యుద్ధ విమానాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
షార్జాలో కర్ణాటక వ్యక్తి దారుణ హత్య..
జనరల్

షార్జాలో కర్ణాటక వ్యక్తి దారుణ హత్య..

కొండచరియల ముప్పునకు చెక్‌.. అరుణాచలంలో మరమ్మతులు
జనరల్

కొండచరియల ముప్పునకు చెక్‌.. అరుణాచలంలో మరమ్మతులు

ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు...
జనరల్

ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు...

ఐమెక్‌కు అమెరికా పూర్తి మద్దతు-ట్రంప్‌
జనరల్

ఐమెక్‌కు అమెరికా పూర్తి మద్దతు-ట్రంప్‌

సుంకాల వేళ మోదీ-ట్రంప్ భేటీకి అవకాశం
జనరల్

సుంకాల వేళ మోదీ-ట్రంప్ భేటీకి అవకాశం

తెలంగాణ ఈగల్ ఫోర్స్ టీమ్‌కు  సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
జనరల్

తెలంగాణ ఈగల్ ఫోర్స్ టీమ్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

అమెరికా-ఇరాన్‌ చర్చల మధ్య పేలుళ్లు.. హర్మూజ్‌ వద్ద అసలేం జరిగింది?
జనరల్

అమెరికా-ఇరాన్‌ చర్చల మధ్య పేలుళ్లు.. హర్మూజ్‌ వద్ద అసలేం జరిగింది?

‘ప్యారడైజ్‌’ టికెట్‌ రేట్ల పెంపుపై పునఃసమీక్షించండి.. ప్రభుత్వానికి హైకోర్టు సూచన
జనరల్

‘ప్యారడైజ్‌’ టికెట్‌ రేట్ల పెంపుపై పునఃసమీక్షించండి.. ప్రభుత్వానికి హైకోర్టు సూచన

నిమజ్జనంలో శబ్ద నియంత్రణపై రిపోర్ట్ ఇవ్వండి.. హోంశాఖకు హైకోర్టు ఆదేశం
జనరల్

నిమజ్జనంలో శబ్ద నియంత్రణపై రిపోర్ట్ ఇవ్వండి.. హోంశాఖకు హైకోర్టు ఆదేశం

ఆసియా క్రీడలు 2026: జపాన్‌లో టీ20 సమరానికి సిద్ధమైన భారత పురుషుల జట్టు
క్రీడలు

ఆసియా క్రీడలు 2026: జపాన్‌లో టీ20 సమరానికి సిద్ధమైన భారత పురుషుల జట్టు

తెలంగాణ రుచిని మీకు ఇష్టమైన సింగిల్ స్క్రీన్స్‌కు తీసుకొస్తున్న మైత్రీ థియేటర్స్!
సినిమాలు

తెలంగాణ రుచిని మీకు ఇష్టమైన సింగిల్ స్క్రీన్స్‌కు తీసుకొస్తున్న మైత్రీ థియేటర్స్!

బడా గణేష్ దర్శనానికి నేటితో ముగింపు..
జనరల్

బడా గణేష్ దర్శనానికి నేటితో ముగింపు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!