1, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మా కుమారుడి పెళ్ళికి రండి - రాష్ట్రపతి, ప్రధానికి సచిన్ టెండూల్కర్ ఇన్విటేషన్

Writer: Priya 09:40 PM, 10 ఫిబ్రవరి, 2026
మా కుమారుడి పెళ్ళికి రండి - రాష్ట్రపతి, ప్రధానికి సచిన్ టెండూల్కర్ ఇన్విటేషన్

టీమ్ ఇండియా క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇంట ఆనందోత్సవం మొదలైంది. ఆయన కుమారుడు, యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. చిన్ననాటి స్నేహితురాలు సానియా చందోక్‌తో అర్జున్ వివాహం జరగనుండటం టెండూల్కర్ కుటుంబంలో ఆనందాన్ని నింపింది. ఈ పెళ్లి వేడుకను మార్చి 5న ముంబయిలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే పెళ్లి పనులు జోరుగా సాగుతుండగా, సచిన్ కుటుంబం స్వయంగా ప్రముఖులకు ఆహ్వానాలు అందజేస్తోంది.

ఈ క్రమంలో తాజాగా సచిన్ తన కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. మంగళవారం న్యూఢిల్లీలోని ప్రధాని నివాసానికి వెళ్లిన సచిన్, అర్జున్–సానియా వివాహ ఆహ్వాన పత్రికను మోదీకి అందజేశారు. ఈ సందర్భంగా చందోక్ కుటుంబ సభ్యులు కూడా సచిన్ కుటుంబంతో పాటు ఉన్నారు. సచిన్ కుటుంబాన్ని ప్రధాని మోదీ ఆత్మీయంగా పలకరిస్తూ, కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇరు కుటుంబాలతో కలిసి ఫొటోలు దిగారు. అర్జున్, సానియా ప్రధానితో కలిసి ప్రత్యేకంగా ఫొటోలు దిగడం విశేషంగా మారగా, ఈ ఫొటోలను సచిన్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానుల నుంచి భారీగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కూడా సచిన్ వివాహ ఆహ్వానం అందజేశారు.


వధువు సానియా చందోక్ ముంబయికి చెందిన ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందినవారు కాగా, ప్రఖ్యాత వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలిగా ఆమెకు గుర్తింపు ఉంది. కుటుంబ నేపథ్యంతో పాటు, ఆమె స్వయంగా కూడా వ్యాపార రంగంలో రాణిస్తూ ‘మిస్టర్ పాస్ పెట్ స్పా’ అనే పెట్ కేర్ సంస్థను నిర్వహిస్తోంది. సానియా చాలా ఏళ్లుగా సచిన్ కుటుంబానికి సన్నిహితంగా ఉంటూ, సారా టెండూల్కర్తో మంచి స్నేహబంధాన్ని కొనసాగిస్తోంది. ఈ అనుబంధం క్రమంగా వివాహ బంధంగా మారడం విశేషం. అర్జున్ టెండూల్కర్ కూడా తన తండ్రి బాటలోనే క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుని, దేశీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో ఆడుతూ తనకంటూ గుర్తింపు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తంగా టెండూల్కర్ కుటుంబంలో జరగనున్న ఈ వివాహ వేడుకపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొనగా, క్రీడా, రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు హాజరవుతారని సమాచారం. అర్జున్–సానియా జంటకు అభిమానులు ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి కొత్త జీవితం ఆనందం, విజయాలతో సాగాలని కోరుకుంటున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ముంబై–బెంగళూరు మధ్య వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం

ముంబై–బెంగళూరు మధ్య వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం

బార్లు, రెస్టారెంట్లకు ఊరట.. కొత్త ప్రత్యేక ఫీజు వసూలుపై హైకోర్టు స్టే

బార్లు, రెస్టారెంట్లకు ఊరట.. కొత్త ప్రత్యేక ఫీజు వసూలుపై హైకోర్టు స్టే

బంగాళాఖాతంలో మురసు తుఫాన్‌ తీవ్రతరం..

బంగాళాఖాతంలో మురసు తుఫాన్‌ తీవ్రతరం..

ఉత్తరాఖండ్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం.. ఆరుగురి మృతదేహాలు వెలికితీత

ఉత్తరాఖండ్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం.. ఆరుగురి మృతదేహాలు వెలికితీత

ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. మధ్యాహ్నం 1 గంట వరకు 37.13 శాతం పోలింగ్

ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. మధ్యాహ్నం 1 గంట వరకు 37.13 శాతం పోలింగ్

'ఓటు చోరీ' వివాదానికి దాదాపు 150 ఏళ్ల చరిత్ర

'ఓటు చోరీ' వివాదానికి దాదాపు 150 ఏళ్ల చరిత్ర

ట్యాగ్లు
సచిన్ టెండూల్కర్అర్జున్ టెండూల్కర్సానియా చందోక్ద్రౌపదీ ముర్ముప్రధానమంత్రి నరేంద్ర మోదీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అవెంజర్స్ పాత్రలు మార్చుకున్న రాబర్ట్ డౌనీ జూనియర్, పెడ్రో పాస్కల్
సినిమాలు

అవెంజర్స్ పాత్రలు మార్చుకున్న రాబర్ట్ డౌనీ జూనియర్, పెడ్రో పాస్కల్

జ్ఞానేశ్ కుమార్ జైలుకు వెళ్లడం ఖాయం-రాహుల్ గాంధీ
రాజకీయాలు

జ్ఞానేశ్ కుమార్ జైలుకు వెళ్లడం ఖాయం-రాహుల్ గాంధీ

 అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు..
బిజినెస్

అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు..

బిగ్‌బాస్ 10 నుంచి రోహిత్ ఎలిమినేషన్? వైరల్ వార్తలపై కౌశల్ స్పందన
షోస్

బిగ్‌బాస్ 10 నుంచి రోహిత్ ఎలిమినేషన్? వైరల్ వార్తలపై కౌశల్ స్పందన

హైలో ఓపెన్ 500 ఫైనల్‌కు సింధు, లక్ష్యసేన్..
క్రీడలు

హైలో ఓపెన్ 500 ఫైనల్‌కు సింధు, లక్ష్యసేన్..

భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం..
క్రీడలు

భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం..

ముంబై–బెంగళూరు మధ్య వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం
జనరల్

ముంబై–బెంగళూరు మధ్య వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం

బార్లు, రెస్టారెంట్లకు ఊరట.. కొత్త ప్రత్యేక ఫీజు వసూలుపై హైకోర్టు స్టే
జనరల్

బార్లు, రెస్టారెంట్లకు ఊరట.. కొత్త ప్రత్యేక ఫీజు వసూలుపై హైకోర్టు స్టే

చివరి టీ20లో గెలుపే లక్ష్యంగా భారత్‌.. కివీస్‌పై ఆధిపత్యం చాటేనా?
క్రీడలు

చివరి టీ20లో గెలుపే లక్ష్యంగా భారత్‌.. కివీస్‌పై ఆధిపత్యం చాటేనా?

బంగాళాఖాతంలో మురసు తుఫాన్‌ తీవ్రతరం..
జనరల్

బంగాళాఖాతంలో మురసు తుఫాన్‌ తీవ్రతరం..

మధుమేహం కంటే అధిక బీఎంఐతోనే తల్లిపాలివ్వడంలో తగ్గుదల ఉండొచ్చు: అధ్యయనం
ఆరోగ్యం

మధుమేహం కంటే అధిక బీఎంఐతోనే తల్లిపాలివ్వడంలో తగ్గుదల ఉండొచ్చు: అధ్యయనం

బ్యాంకు ఓటీపీలే టార్గెట్‌.. ‘మిస్టర్‌ రోబోట్‌’ సైబర్‌ ముఠా కొత్త మోసం!
టెక్నాలజీ

బ్యాంకు ఓటీపీలే టార్గెట్‌.. ‘మిస్టర్‌ రోబోట్‌’ సైబర్‌ ముఠా కొత్త మోసం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!