

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు అవసరమైన నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) జారీ చేయాలని ఆయన కోరారు. ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో తెలంగాణలో నీటి అవసరాలు పెరిగే అవకాశం ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అవసరాలను తీర్చేందుకు సమ్మక్క సాగర్ ప్రాజెక్టు కీలకమని, నీటి నిల్వకు అవసరమైన అనుమతులు పొందడం ముఖ్యమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
సమ్మక్క సాగర్ బ్యారేజీలో నీటిని నిల్వ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఛత్తీస్‌గఢ్ సీఎంను విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా రావాల్సిన మిగిలిన అనుమతుల విషయంలో కూడా సహకరించాలని కోరారు. తెలంగాణలో పెరగనున్న నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతుల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు సహకరించాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఈ విజ్ఞప్తులపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!