
షోస్

తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇన్‌చార్జ్ సందీప్ ఈ నెల 22న హైదరాబాద్‌కు రానున్నారు. ఈ సందర్భంగా ఉదయం 11 గంటలకు గాంధీభవన్‌లో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి సందీప్‌తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ హాజరుకానున్నారు. రాష్ట్రంలో పార్టీ రాజకీయ పరిస్థితులు, సంస్థాగత వ్యవహారాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. అనంతరం 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, పార్టీకి చెందిన ముఖ్య నేతలతో సందీప్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, పార్టీ నేతల మధ్య సమన్వయం వంటి అంశాలపై ఈ భేటీల్లో చర్చించే అవకాశం ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!