

వాహనదారులు తప్పనిసరిగా కలిగి ఉండాల్సిన బీమా పాలసీ అమలును మరింత కట్టుదిట్టం చేసేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) కొత్త అలర్ట్ వ్యవస్థను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. ఈ విధానం అమల్లోకి వస్తే, బీమా లేని వాహనం టోల్ ప్లాజా దాటిన వెంటనే సంబంధిత వాహన యజమాని మొబైల్‌కు హెచ్చరిక సందేశం పంపించే అవకాశం ఉంది. వాహనాలకు ఇన్సూరెన్స్ ఉందా లేదా అనే విషయాన్ని గుర్తించి, నిబంధనల అమలును పర్యవేక్షించడమే ఈ వ్యవస్థ ప్రధాన ఉద్దేశం.
మొబైల్‌కు వచ్చిన హెచ్చరికను పట్టించుకోకుండా వాహనానికి బీమా చేయించకపోతే, నిబంధనల ప్రకారం రూ.10 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే, ఈ అలర్ట్ వ్యవస్థ ప్రస్తుతం ప్రయోగాత్మక దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక మార్గదర్శకాలు, అమలు తేదీ, జరిమానాల విధానం వంటి వివరాలు వెల్లడైన తర్వాతే పూర్తి స్పష్టత రానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!