

ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ విధానంలో కీలక మార్పులకు సిద్ధమవుతోంది. 2026-27 విద్యాసంవత్సరం నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది. ఈ కొత్త విధానంలో ముందుగా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అలాగే విద్యార్థుల ఫీజులను అదే విద్యాసంవత్సరంలో చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. దీని ద్వారా విద్యార్థులు, కాలేజీలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులకు ఉపశమనం లభించనుంది.
కొత్త ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ విధానాల అమలుకు ప్రభుత్వం రూ.2,300 కోట్ల నుంచి రూ.2,400 కోట్ల వరకు నిధులు కేటాయించే అవకాశముందని సమాచారం. స్కాలర్షిప్ల పంపిణీలో పారదర్శకత తీసుకురావడంతో పాటు చెల్లింపుల ప్రక్రియను మరింత సమర్థవంతంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది. సమయానికి నిధులు విడుదల కావడం వల్ల విద్యార్థులకు, విద్యాసంస్థలకు భారీ ఊరట కలగనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!