

ఆంధ్రప్రదేశ్‌లో వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రుల కమిటీ సిఫార్సుల మేరకు వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, శానిటేషన్, ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ (గ్రేడ్-2), వార్డు ప్లానింగ్, రెగ్యులేషన్ కార్యదర్శుల పదోన్నతుల కోసం వార్డుల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. హేతుబద్ధీకరణలో మిగిలిన 458 వార్డు ఎమెనిటీస్ సెక్రటరీ (గ్రేడ్-2), 457 వార్డు ప్లానింగ్, రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్-2) పోస్టుల స్థానంలో అదనపు ఆర్థిక భారం లేకుండా 815 కొత్త జూనియర్ అసిస్టెంట్ పోస్టులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
కొత్తగా ఏర్పాటు చేసిన జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అర్హత ఉన్న వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలకు ముందుగా పదోన్నతులు కల్పించనున్నారు. అనంతరం ఏర్పడే ఖాళీల ఆధారంగా వార్డు డేటా ప్రాసెసింగ్ కార్యదర్శులకు పదోన్నతులు ఇవ్వనున్నారు. మరోవైపు వార్డు శానిటేషన్, ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ, వార్డు ప్లానింగ్, రెగ్యులేషన్ కార్యదర్శుల కేడర్లలో గ్రేడ్-2 పోస్టుల నుంచి చెరో 815 చొప్పున మొత్తం 1,630 పోస్టులను గ్రేడ్-1గా అప్‌గ్రేడ్ చేయాలన్న ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ వివరాలను పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్ వెల్లడించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!