
గాసిప్స్

తమిళనాడు మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ IPS అధికారి కె. అన్నామలై బీజేపీకి రాజీనామా చేసిన అనంతరం “We The Leader” అనే కొత్త రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించారు. కోయంబత్తూరులోని APJ అబ్దుల్ కలాం సెంటర్ ఫర్ ఎథిక్స్ అండ్ పాలిటిక్స్ ఆధ్వర్యంలో ఈ ఉద్యమం పనిచేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
ఈ ఉద్యమం ఎటువంటి రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా స్వతంత్రంగా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. “కలాం స్కూల్ ఆఫ్ ఐడియాలజీ” ఆధారంగా నైతిక రాజకీయాలు, మంచి పాలన, విద్య, ఆరోగ్యం, గ్రామీణ అభివృద్ధి లక్ష్యంగా ఈ ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు. ప్రారంభమైన కొద్ది గంటల్లోనే లక్షల మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు సమాచారం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!