
సినిమాలు

ప్రధాని నరేంద్ర మోదీ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించి దేశానికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. టెర్మినల్‌ను ప్రారంభించిన అనంతరం ప్రధాని సుమారు 15 నిమిషాల పాటు విమానాశ్రయ సౌకర్యాలను పరిశీలించారు.
తర్వాత ఓపెన్ టాప్ కారులో ప్రయాణిస్తూ రికార్డు స్థాయిలో 13,500 మంది కళాకారులు ప్రదర్శించిన థింసా నృత్యాన్ని ప్రధాని మోదీ వీక్షించారు. ఈ సాంస్కృతిక కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ గిరిజన సంప్రదాయాలను ప్రతిబింబించింది. కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానికి సంప్రదాయ బొబ్బిలి వీణను బహూకరించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!