

ఛత్తీస్‌గఢ్‌లోని ఒకప్పుడు మావోయిస్టుల ప్రాబల్యానికి కేంద్రంగా ఉన్న బస్తర్ ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. భద్రతా సిబ్బందితో కలిసి పండుగను జరుపుకున్నారు. బస్తర్ అడవుల్లో విధులు నిర్వహిస్తున్న జవాన్ల మధ్యకు వచ్చి దీపావళి జరుపుకోవడం తనకు ఎంతో ప్రత్యేకమని మోదీ అన్నారు. “మీరంతా నా కుటుంబ సభ్యులే. మీతో కలిసి ఈ పండుగను జరుపుకోవాలనే ఇక్కడికి వచ్చాను” అని పేర్కొన్నారు.
నక్సలిజంపై గత ప్రభుత్వాలు ఉదారంగా వ్యవహరించాయని, దాన్ని నిర్మూలించడంలో విఫలమయ్యాయని ప్రధాని విమర్శించారు. నక్సల్స్ ఏరివేతతో బస్తర్‌లో అభివృద్ధికి మార్గం సుగమమైందని, ఈ ప్రాంతం నక్సల్స్ రహితంగా మారిందని అన్నారు. దేశ రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న భద్రతా సిబ్బందికి, అమరవీరులకు సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. బస్తర్ ప్రాంతంలో భద్రతా బలగాలు సాధించిన పురోగతి అభినందనీయమని, గత 12 నెలలుగా ప్రాణనష్టం లేకుండా సీఆర్‌పీఎఫ్ రికార్డు సాధించిందని ప్రశంసించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!