

నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో జల్ జీవన్ మిషన్ పనుల వేగాన్ని మరింత పెంచాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, అమరజీవి జలధార ప్రాజెక్టు ద్వారా తీర ప్రాంత గ్రామాల తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. నిర్ణీత గడువులోగా నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
రూ.3,050 కోట్ల అంచనా వ్యయంతో కొనసాగుతున్న జల్ జీవన్ మిషన్ పనుల్లో ఇన్‌టేక్ వెల్స్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, రిజర్వాయర్లు, పైప్‌లైన్ నిర్మాణాల పురోగతిని అధికారులు వివరించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రూ.1,650 కోట్లతో చేపట్టిన మెగా వాటర్ గ్రిడ్ ద్వారా 20 లక్షల మందికి తాగునీరు అందించనున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.1,400 కోట్ల ప్రాజెక్టు ద్వారా 13.5 లక్షల మందికి ప్రయోజనం కలగనుండగా, రెండు ప్రాజెక్టుల కింద సుమారు 400 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణం పూర్తయింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!