
బిజినెస్

సైప్రస్ తీరంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఫెర్రీ ప్రమాదానికి గురై బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో ఫెర్రీలో మొత్తం 267 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురి ఆచూకీ గల్లంతైనట్లు ఉత్తర సైప్రస్ అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగి గాలింపు, సహాయక చర్యలు చేపట్టాయి.
ఇప్పటివరకు 159 మందిని అధికారులు సురక్షితంగా రక్షించినట్లు తెలిపారు. గల్లంతైన వారి కోసం సముద్రంలో విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలు ఏమిటనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మిగిలిన ప్రయాణికుల ఆచూకీ కోసం సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!