
సినిమాలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో సౌదీ అరేబియా భద్రతను బలోపేతం చేసేందుకు పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకుంది. సౌదీ భూభాగంపై హౌతీ తిరుగుబాటుదారులు డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసే ముప్పు నేపథ్యంలో అక్కడికి తన సైనికులను తరలిస్తోంది. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ సమక్షంలో సైనికుల మోహరింపు ప్రక్రియ ప్రారంభమైనట్లు సమాచారం.
2026 ఆగస్టు 7న మక్కాలో పాకిస్థాన్, సౌదీ అరేబియా, తుర్కియే దేశాలు సంయుక్త రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం మూడు దేశాల్లో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా, అది మిగతా దేశాలపై జరిగిన దాడిగా కూడా పరిగణిస్తారు. సౌదీ అరేబియాలోని చమురు కేంద్రాలు, ఇతర కీలక మౌలిక సదుపాయాలపై హౌతీల నుంచి ముప్పు పొంచి ఉండటంతో పాకిస్థాన్ సైనిక మోహరింపు ప్రాధాన్యత సంతరించుకుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!