
జనరల్

భారత్, పాకిస్తాన్ మధ్య చర్చల అంశంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే చేసిన వ్యాఖ్యలకు పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం స్పందించింది. రెండు దేశాల మధ్య చర్చలపై భారత్లో నుంచి వినిపిస్తున్న స్వరాలు సానుకూలంగా ఉన్నాయని పేర్కొంది. ఇలాంటి పిలుపులు రావడం మంచి పరిణామమని అభిప్రాయపడింది.
అయితే చర్చల విషయంలో అధికారిక నిర్ణయం భారత ప్రభుత్వంనుంచే రావాలని పాకిస్తాన్ స్పష్టం చేసింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నుంచి కాకుండా భారత ప్రభుత్వ అధికారిక ప్రకటన అవసరమని తెలిపింది. అప్పటివరకు తదుపరి చర్యలపై ముందుకు వెళ్లలేమని పేర్కొంది. ఇటీవల దత్తాత్రేయ హోసబాలే మాట్లాడుతూ పాకిస్తాన్తో చర్చలకు తలుపులు పూర్తిగా మూసేయకూడదని, రెండు దేశాల మధ్య ఎప్పటికైనా చర్చలు జరగాల్సిందేనని వ్యాఖ్యానించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!