26, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జాతీయ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన ఉస్మానియా యూనివర్సిటీ...

Writer: Chandrika 05:56 AM, 26 ఆగస్టు, 2026
జాతీయ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన ఉస్మానియా యూనివర్సిటీ...

ఉస్మానియా యూనివర్సిటీ మరోసారి జాతీయ స్థాయిలో తన సత్తాను చాటుకుంది. విద్య, పరిశోధన రంగాల్లో విశిష్టతను కొనసాగిస్తూ 2026 సంవత్సరానికి సంబంధించిన ప్రతిష్ఠాత్మక జాతీయ ర్యాంకింగ్స్‌లో పలు అగ్రస్థానాలను దక్కించుకుంది. ఇండియా టుడే బెస్ట్ యూనివర్సిటీస్ సర్వే 2026 ప్రకారం.. దేశంలోని అగ్రగామి జనరల్ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల విభాగంలో ఓయూ 4వ ర్యాంక్ సాధించింది. బోధనా ప్రమాణాలు, పరిశోధన, మౌలిక వసతులు, అకడమిక్ నిర్వహణ వంటి అంశాల్లో ఓయూ ప్రదర్శించిన ప్రతిభకు ఈ ర్యాంక్ నిదర్శనంగా నిలిచింది. ఈ జాతీయ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక విశ్వవిద్యాలయం ఓయూ కావడం విశేషం. ఈ విజయంపై వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం హర్షం వ్యక్తం చేశారు.

మరోవైపు ఔట్‌లుక్-ఐకేర్ ర్యాంకింగ్స్ 2026లో టాప్ 75 స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీల విభాగంలో ఓయూ 13వ ర్యాంక్ సాధించింది. పరిశ్రమల భాగస్వామ్యం, విద్యార్థుల అభ్యసన ఫలితాలు, వైవిధ్యత వంటి అంశాల్లో విశ్వవిద్యాలయం సాధించిన పురోగతికి ఈ గుర్తింపు నిదర్శనమని వీసీ తెలిపారు. ఓయూ విజయాలకు మరింత గౌరవాన్ని చేకూరుస్తూ.. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఉస్మానియా యూనివర్సిటీ (యూసీఈ-ఓయూ) జూలై 17, 2026న విడుదలైన ఔట్‌లుక్-ఐకేర్ ర్యాంకింగ్స్‌లో టాప్ 25 ప్రభుత్వ ఇంజనీరింగ్ సంస్థల విభాగంలో 18వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ విజయాలను అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు, బోధనేతర సిబ్బంది, పూర్వ విద్యార్థుల సమిష్టి కృషికి అంకితం చేస్తున్నట్లు వీసీ పేర్కొన్నారు. ర్యాంకింగ్స్ మరింత మెరుగైన బోధన, పరిశోధన, ప్రపంచ స్థాయి ఆవిష్కరణలకు ప్రోత్సాహాన్ని అందిస్తాయని, ఉస్మానియా యూనివర్సిటీని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు అందరూ కలసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కరవు నేలకు కృష్ణమ్మ పరుగు..

కరవు నేలకు కృష్ణమ్మ పరుగు..

హైదరాబాద్‌లో నకిలీ వైద్యుల గుట్టురట్టు..

హైదరాబాద్‌లో నకిలీ వైద్యుల గుట్టురట్టు..

కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..

కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..

‘విజయ్ రోడ్’గా మారనున్న ఏకనాపురం మెయిన్‌ రోడ్...పరందూర్ రైతుల కృతజ్ఞత

‘విజయ్ రోడ్’గా మారనున్న ఏకనాపురం మెయిన్‌ రోడ్...పరందూర్ రైతుల కృతజ్ఞత

హైదరాబాద్ TIMS ఆస్పత్రిలో త్వరలో పూర్తిస్థాయి సర్జరీ సేవలు..

హైదరాబాద్ TIMS ఆస్పత్రిలో త్వరలో పూర్తిస్థాయి సర్జరీ సేవలు..

వింధ్య పర్వతానికి గర్వభంగం చేసిన అగస్త్య మహర్షి..

వింధ్య పర్వతానికి గర్వభంగం చేసిన అగస్త్య మహర్షి..

ట్యాగ్లు
ఉస్మానియా యూనివర్సిటీఓయూ ర్యాంకింగ్స్ 2026ఇండియా టుడే ర్యాంకింగ్స్ఔట్‌లుక్ ఐకేర్ ర్యాంకింగ్స్తెలంగాణ విద్యఉన్నత విద్యయూనివర్సిటీ ర్యాంకింగ్స్యూసీఈ ఓయూపరిశోధనవిద్యా ప్రతిభప్రభుత్వ విశ్వవిద్యాలయాలుతెలంగాణ యూనివర్సిటీలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై కిషన్ రెడ్డి ఫైర్..
రాజకీయాలు

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై కిషన్ రెడ్డి ఫైర్..

శంషాబాద్‌ విమానాశ్రయంలో యూడీఎఫ్‌ ఛార్జీల మార్పు..
జనరల్

శంషాబాద్‌ విమానాశ్రయంలో యూడీఎఫ్‌ ఛార్జీల మార్పు..

కరవు నేలకు కృష్ణమ్మ పరుగు..
జనరల్

కరవు నేలకు కృష్ణమ్మ పరుగు..

హైదరాబాద్‌లో నకిలీ వైద్యుల గుట్టురట్టు..
జనరల్

హైదరాబాద్‌లో నకిలీ వైద్యుల గుట్టురట్టు..

కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..
జనరల్

కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..

కొండా సురేఖ ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్..
గాసిప్స్

కొండా సురేఖ ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్..

‘విజయ్ రోడ్’గా మారనున్న ఏకనాపురం మెయిన్‌ రోడ్...పరందూర్ రైతుల కృతజ్ఞత
జనరల్

‘విజయ్ రోడ్’గా మారనున్న ఏకనాపురం మెయిన్‌ రోడ్...పరందూర్ రైతుల కృతజ్ఞత

హైదరాబాద్ TIMS ఆస్పత్రిలో త్వరలో పూర్తిస్థాయి సర్జరీ సేవలు..
జనరల్

హైదరాబాద్ TIMS ఆస్పత్రిలో త్వరలో పూర్తిస్థాయి సర్జరీ సేవలు..

నెట్‌ఫ్లిక్స్‌ ‘బాహుబలి’ ప్రీక్వెల్‌కు ఏమైంది?
సినిమాలు

నెట్‌ఫ్లిక్స్‌ ‘బాహుబలి’ ప్రీక్వెల్‌కు ఏమైంది?

సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై సగం, సగం తెలిసిన నేతలు మాట్లాడుతున్నారు: ఎంపీ చామల కిరణ్
రాజకీయాలు

సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై సగం, సగం తెలిసిన నేతలు మాట్లాడుతున్నారు: ఎంపీ చామల కిరణ్

జాతీయ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన ఉస్మానియా యూనివర్సిటీ...
జనరల్

జాతీయ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన ఉస్మానియా యూనివర్సిటీ...

‘ఇరుముడి’ నన్ను ఊహించని విధంగా కదిలించింది -రష్మిక మందన్నా
సినిమాలు

‘ఇరుముడి’ నన్ను ఊహించని విధంగా కదిలించింది -రష్మిక మందన్నా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!