

మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి. హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తెలంగాణ జల హక్కులకు తీవ్ర ప్రమాదం ఏర్పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర జల ప్రయోజనాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆయన హెచ్చరించారు.
07-04-2026 తేదీతో రాసిన లేఖలో, లిఫ్ట్ ఇరిగేషన్ పంపుల నిర్వహణపై బీఆర్ఎస్ ముందుగా ఇచ్చిన హెచ్చరికలను ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. దీంతో పంపులు దెబ్బతిని, కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల నిర్వహణలో వైఫల్యాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు.
కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ చరిత్రలో కనిష్ట స్థాయికి చేరిందని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ 74 శాతం వినియోగిస్తుండగా, తెలంగాణ 25 శాతానికే పరిమితమైందని తెలిపారు. సోలార్ ఆధారిత విద్యుత్ విధానం సాగునీటి రంగానికి ముప్పుగా మారుతుందని విమర్శించారు. రైతు డిస్కం ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని, కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టులకు తగిన నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!