

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో 42 ఏళ్ల బంగ్లాదేశ్ జాతీయుడు అతిక్ హుస్సేన్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. నకిలీ భారతీయ గుర్తింపు పత్రాలను ఉపయోగిస్తూ భారత్‌లో అక్రమంగా నివసిస్తున్నట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. 2005లో బంగ్లాదేశ్‌లోని నారాయణ్‌గంజ్ నుంచి భారత్‌లోకి ప్రవేశించిన అతిక్.. 2007లో బిలాస్‌పూర్‌కు వచ్చినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
బిలాస్‌పూర్‌లోని NTPC సిపాట్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్‌లో BECO Lifts Pvt. Ltd. అనే ప్రైవేట్ కాంట్రాక్టర్ ద్వారా ఎలివేటర్ మెయింటెనెన్స్ టెక్నీషియన్‌గా పనిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అతడి అద్దె నివాసంలో నకిలీ భారతీయ పాస్‌పోర్ట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, డొమిసైల్ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, 9వ తరగతి మార్క్‌షీట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కేసులో తదుపరి దర్యాప్తుతో పాటు డిపోర్టేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!