

నిమ్స్ అదనపు సూపరింటెండెంట్ లక్ష్మీభాస్కర్‌ను మూడు రోజుల పాటు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కస్టడీకి అప్పగిస్తూ ఏసీబీ కోర్టు అనుమతించింది. ఈ మేరకు నేటి నుంచి మూడు రోజుల పాటు ఆయనను విచారించేందుకు అధికారులకు అవకాశం లభించింది. చంచల్‌గూడ జైలు నుంచి లక్ష్మీభాస్కర్‌ను కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు.
లక్ష్మీభాస్కర్‌కు సంబంధించిన బినామీ ఆస్తుల వివరాలను వెలికితీసేందుకు ఏసీబీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఆయనకు సంబంధించిన అక్రమాస్తులు రూ.100 కోట్లకు పైగా ఉన్నట్లు అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆస్తుల కొనుగోళ్లు, పెట్టుబడులు, బినామీల పేర్లపై ఉన్న ఆస్తుల వివరాలపై విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక ప్రకటనల ద్వారా మరింత స్పష్టతకు రావాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!