
షోస్

తెలంగాణలో NEET-PG 2026 పరీక్షను 14 జిల్లాల్లోని 56 పరీక్షా కేంద్రాల్లో అధికారులు సజావుగా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 17,626 మంది అభ్యర్థులు పరీక్షకు నమోదు చేసుకోగా, వారిలో 17,143 మంది హాజరయ్యారు. మరో 483 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 97.26 శాతం హాజరు నమోదైంది.
అన్ని పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని టీసీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రీజినల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పరీక్షల నిర్వహణను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!