30, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారీ విస్తరణకు సిద్ధమైన లలితా జువెలరీ మార్ట్‌...

Writer: Chandrika 01:09 PM, 30 ఆగస్టు, 2026
భారీ విస్తరణకు సిద్ధమైన లలితా జువెలరీ మార్ట్‌...

తొలి పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) పూర్తి చేసుకున్న లలితా జువెలరీ మార్ట్‌ లిమిటెడ్‌ వ్యాపార విస్తరణపై స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతోందని సంస్థ సీఎండీ ఎం. కిరణ్‌ కుమార్‌ తెలిపారు. శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాల్లో రిటెయిల్‌ నెట్‌వర్క్‌ను భారీగా విస్తరించడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో 64 షోరూమ్‌లు ఉన్నాయని, అదనంగా 110 కేంద్రాలను ప్రారంభించడమే లక్ష్యమని చెప్పారు. 2027 మార్చి నాటికి కనీసం 10 కొత్త స్టోర్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. దక్షిణాదిలో 175 షోరూమ్‌లకు చేరుకున్న తర్వాత మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, దిల్లీ మార్కెట్లలోకి విస్తరించనున్నట్లు వివరించారు.

అంతర్జాతీయ విస్తరణలో భాగంగా వచ్చే 2–3 నెలల్లో మలేషియాలో షోరూమ్‌ ప్రారంభించనున్నామని, అనంతరం సింగపూర్‌లో అడుగుపెడతామని కిరణ్‌ కుమార్‌ తెలిపారు. తక్కువ లాభంతో అధిక విక్రయాలు సాధించడమే తమ ప్రధాన వ్యూహమని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో 58 షోరూమ్‌ల ద్వారా రూ.25,000 కోట్ల మొత్తం ఆదాయం, రూ.1,000 కోట్ల నికర లాభం ఆర్జించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారు ఆభరణాలపైనే దృష్టి సారిస్తున్నామని, 9 లేదా 14 క్యారెట్ల బంగారం విక్రయించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. తమ వినియోగదారుల్లో సుమారు 60 శాతం మంది పాత బంగారాన్ని మార్పిడి చేసుకుంటున్నారని తెలిపారు. బంగారం ధర దీర్ఘకాలంలో పెరుగుతూనే ఉంటుందని, అందువల్ల పసిడిని సురక్షితమైన పెట్టుబడి సాధనంగా పరిగణించవచ్చని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అంతర్జాతీయ విస్తరణకు జీఎంఆర్‌ అడుగులు.. కొత్త విమానాశ్రయాలపై దృష్టి

అంతర్జాతీయ విస్తరణకు జీఎంఆర్‌ అడుగులు.. కొత్త విమానాశ్రయాలపై దృష్టి

చక్కెర ధరలకు బ్రేక్‌.. కేంద్రం కీలక నిర్ణయం

చక్కెర ధరలకు బ్రేక్‌.. కేంద్రం కీలక నిర్ణయం

ఏథర్‌ నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

ఏథర్‌ నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

బంగారం ధరలకు భారీ షాక్...

బంగారం ధరలకు భారీ షాక్...

ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌కు తొలి త్రైమాసికంలో భారీ వృద్ధి

ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌కు తొలి త్రైమాసికంలో భారీ వృద్ధి

ప్రపంచ మార్కెట్‌లో ఐఫోన్‌ 17 సత్తా..

ప్రపంచ మార్కెట్‌లో ఐఫోన్‌ 17 సత్తా..

ట్యాగ్లు
లలితా జువెలరీ మార్ట్‌లలితా జువెలరీఎం. కిరణ్‌ కుమార్‌బంగారు ఆభరణాలుఆభరణాల వ్యాపారంఐపీఓరిటెయిల్‌ విస్తరణదక్షిణ భారతదేశంమలేషియా మార్కెట్‌సింగపూర్‌ మార్కెట్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తనను తానే మెరుగుపరుచుకునే ఏఐ?
టెక్నాలజీ

తనను తానే మెరుగుపరుచుకునే ఏఐ?

భారీ విస్తరణకు సిద్ధమైన లలితా జువెలరీ మార్ట్‌...
బిజినెస్

భారీ విస్తరణకు సిద్ధమైన లలితా జువెలరీ మార్ట్‌...

యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న ‘ది ప్యారడైజ్‌’ సెకండ్‌ సింగిల్‌ ‘యేశనగుల’..
సినిమాలు

యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న ‘ది ప్యారడైజ్‌’ సెకండ్‌ సింగిల్‌ ‘యేశనగుల’..

భారీ చిత్రాలు, ఒరిజినల్ సిరీస్‌లతో సరికొత్త కంటెంట్ లైనప్‌ ప్రకటించిన జీ5
ఓటీటీ

భారీ చిత్రాలు, ఒరిజినల్ సిరీస్‌లతో సరికొత్త కంటెంట్ లైనప్‌ ప్రకటించిన జీ5

చిరంజీవి బర్త్‌డే విషెస్‌కు నాగార్జున ఎమోషనల్ రిప్లై...
సినిమాలు

చిరంజీవి బర్త్‌డే విషెస్‌కు నాగార్జున ఎమోషనల్ రిప్లై...

‘ఇరుముడి’ జోష్‌లో రెండు కొత్త సినిమాలకు రవితేజ గ్రీన్ సిగ్నల్...
సినిమాలు

‘ఇరుముడి’ జోష్‌లో రెండు కొత్త సినిమాలకు రవితేజ గ్రీన్ సిగ్నల్...

సౌత్‌ కరోలినాలో కాల్పుల కలకలం..
జనరల్

సౌత్‌ కరోలినాలో కాల్పుల కలకలం..

తమిళనాడు ముస్లిం మహిళలకు గుడ్‌న్యూస్‌..
జనరల్

తమిళనాడు ముస్లిం మహిళలకు గుడ్‌న్యూస్‌..

‘టాక్సిక్‌’ను వెనక్కి నెట్టిన ‘ఇరుముడి’..
సినిమాలు

‘టాక్సిక్‌’ను వెనక్కి నెట్టిన ‘ఇరుముడి’..

కాప్రా చెరువు ఇక నిమజ్జనాలకు దూరం: హైడ్రా కమిషనర్‌
జనరల్

కాప్రా చెరువు ఇక నిమజ్జనాలకు దూరం: హైడ్రా కమిషనర్‌

ఎవరెస్ట్‌ ఇంగువ విక్రయాలపై FSSAI నిషేధం..
జనరల్

ఎవరెస్ట్‌ ఇంగువ విక్రయాలపై FSSAI నిషేధం..

నేపాల్‌ వరదల విధ్వంసం.. పునర్నిర్మాణానికి వేల కోట్లు అవసరం: బినోద్‌ చౌదరి
జనరల్

నేపాల్‌ వరదల విధ్వంసం.. పునర్నిర్మాణానికి వేల కోట్లు అవసరం: బినోద్‌ చౌదరి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!