
జనరల్

దేశవ్యాప్తంగా ఈ నెల 20న మెడికల్ షాపులు బంద్ కానున్నాయి. ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలను వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ ఈ బంద్‌కు పిలుపునిచ్చింది.
కోవిడ్ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆన్‌లైన్ మందుల అనుమతులను రద్దు చేయాలని సంఘం డిమాండ్ చేసింది. ఆన్‌లైన్ ద్వారా నకిలీ మరియు ప్రమాదకర మందులు సరఫరా అవుతున్నాయని ఆరోపిస్తూ, ప్రజల ఆరోగ్య భద్రత కోసం ఈ సేవలను నిలిపివేయాలని కోరుతోంది. దేశవ్యాప్తంగా 12.40 లక్షలకు పైగా మెడికల్ షాపులు బంద్‌లో పాల్గొననున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!